తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానాంలో వచ్చే నెల 6న ఎన్నికలు జరగనున్నాయి. యానాం అసెంబ్లీ స్థానానికి.. పుదుచ్చేరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి పోటీ చేయనుండడంపై.. ఎన్నికల సంఘం ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి సారించింది.
ఇప్పటికే.. ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రత్యేక బలగాలు 80 మంది ఉండగా.. అదనంగా సీఆర్పీఎఫ్ పోలీస్ బలగాలను పంపించింది. వీరు నిర్వర్తించాల్సిన విధుల గురించి రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ వివరించారు. అనంతరం ఎస్పీ భక్తవత్సలం, సీఐ శివ గణేశ్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు.