పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కాకినాడలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జరిగింది. సర్పవరం పోలీస్ గెస్ట్ హౌస్ నుంచి భానుగుడి సెంటర్ వరకు ర్యాలీ చేశారు. పోలీసుల్లో సమైక్యత కోసం పరుగు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
కాకినాడలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు - run for unity in kakinada
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరిగాయి. స్మారక వారోత్సవాల సందర్భంగా పోలీసులు రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు.
కాకినాడలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం
సమాజంలోని ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు పోలీసులు ప్రాణం ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పోలీసు వారోత్సవాల్లో భాగంగా మంగళగిరిలో ఓపెన్ హౌస్ కార్యక్రమం