ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్తిపాడులో తెదేపా శ్రేణుల గృహనిర్బంధం - ప్రత్తిపాడులో తెదేపా శ్రేణుల గృహనిర్బంధం

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి అసెంబ్లీ ముట్టడికి తెదేపా కార్యకర్తలతో బయలుదేరిన వరుపుల రాజాను పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి నుంచి గృహ నిర్బంధంలో ఉన్న రాజా వంద కార్లల్లో నాలుగువందల మంది అనుచరులతో కలిసి అమరావతి బయలుదేరారు. ఇంటి వద్దే భారీగా మోహరించిన పోలీసులు ఆయనను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అడ్డుకోవడం సమంజసం కాదని రాజా ఆవేదనవ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు తమకు ఉందని రాజా అన్నారు. ప్రభుత్వం నిరంకుశ విధానాలను విడిచి అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

police house arrested tdp leaders at east godavri district
వరుపుల రాజాను అడ్డుకుంటున్న పోలీసులు

By

Published : Jan 20, 2020, 9:37 AM IST

..

ప్రత్తిపాడులో తెదేపా శ్రేణుల గృహనిర్బంధం

ABOUT THE AUTHOR

...view details