రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ఆరేళ్ళ బాలుడికి ఆర్థిక సహాయం చేసి ఒక పోలీస్ అధికారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గతనెల 9వ తేదీన తూ.గో జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన సత్యనారాయణ, తన ఆరేళ్ళ కుమారిడితో ద్విచక్ర వాహనంపై కాకినాడ వైపు వెళ్తూ, ప్రమాదానికిగురై ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన కుమారుడు గంగబాబు మృత్యువును జయించి ఆసుపత్రి నుండి క్షేమంగా ఇల్లు చేరాడు. ఆ బాలుడుకి జగ్గంపేట సిఐ. రాంబాబు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి తన ఔదర్యాన్ని చాటుకున్నాడు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి అన్ని వేళల తాము అండగా ఉంటామని పోలిసులు తెలిపారు.
ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి పోలిసుల ఆర్దిక సాయం - east godavari
ఇంటి యజమాని ద్విచక్ర వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆర్దిక పరిస్థికి చితికి పోయి ఉన్న ఆ కుంటుంబానికి తన వంత సాయంగా రూ.పదివేలు ఇచ్చి ఓ పోలిసు తన ఔదర్యాం చాటుకున్నాడు.
'పోలీసు ఔదార్యం..'