ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెత్తకుప్పలో పోలీస్ టోపీ! - తూర్పుగోదావరి జిల్లా పోలీస్ వార్తలు

పోలీస్ టోపీ మీద కనిపించే మూడు సింహాలు చెత్త కుప్ప మీద దర్శనమిస్తే అత్యంత బాధాకరంగా ఉంటుంది కదా. ఇలాంటి బాధ్యతారహితమైన సంఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది.

http://10.10.50.85//gujarat/21-December-2020/gj-dmn-01-gpcb-search-vis-gj10020_21122020095746_2112f_00229_998.jpg
Police hat

By

Published : Dec 21, 2020, 11:39 AM IST

'కనిపించే ఆ మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతి రూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్.' ఇదీ ఓ చిత్రంలో పోలీస్ విధి నిర్వహణపై నటుడు చెప్పే డైలాగ్. విధులకు చిహ్నంగా భావించే పోలీస్ టోపీ అమలాపురం సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట చెత్త కుప్పలో దర్శనమివ్వడం విమర్శలకు తావిస్తోంది. సమీపంలోనే రూరల్ పోలీస్​స్టేషన్ ఉండడం గమనార్హం. విషయాన్ని రూరల్ ఎస్సై రాజేష్ వద్ద ప్రస్తావించగా టోపీ వెంటనే అక్కడ్నుంచి తీయిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details