తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ చలానాల కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ సునందశ్రీ ఫిర్యాదు మేరకు 39 చలానాలు నకిలీవిగా గుర్తించారు. ఈ కేసులో నలుగురు లేఖరులు, ఒక ప్రైవేట్ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండపేట సీఐ శివ గణేశ్, ఎస్సై శివ ప్రసాద్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి.. సిబ్బంది వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి దాకమూరి దుర్గాప్రసాద్, యెరుబండి శ్రీరామచంద్రమూర్తి, తటవర్తి గోపాలకృష్ణ, పంతాల వీరవెంకట సూర్య భగవాన్, కోట వెంకటరమణపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రూ. 7,31,510 విలువైన నకిలీ చలానాలకు సంబంధించి ఇప్పటికే వీరి వద్ద నుంచి అధికారులు రికవరీ చేసినట్లు వెల్లడించారు.