ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళాశాల పక్కన గాయాలతో బాలుడు... అసలేం జరిగింది? - undefined

ఏలేశ్వరంలో కనిపించకుండా పోయిన 11 ఏళ్ల బాలుడి ఆచూకీ లభ్యమైంది.

తీవ్రగాయాలతో బాలుడి ఆచూకీ లభ్యం

By

Published : Aug 9, 2019, 12:16 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన తోట ధనుష్ నిన్న పాఠశాల నుంచి ఇంటికి ఆర్టీసీ బస్సులో ఇంటికి వెళ్లేవాడు. నిన్న సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరిన ధనుష్ రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవటంతో తల్లిదండ్రులు కంగారు పడి బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. అర్ధరాత్రి గడిచినా, ఆచూకీ లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. బాలుడి అదృశ్యమైనట్టు కేసు నమోదు చేసుకొన్న ఏలేశ్వరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అనుమానం ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిని విచారించగా బాలుడిని ఏలేశ్వరం డిగ్రీ కళాశాల ఉన్నట్లు చెప్పారు. అక్కడకు పోలీసులు చేరుకునేసరికి కొన ఊపిరితో తుప్పల మధ్య పడి ఉన్నాడు ధనుష్ను. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిందితులు ఎందుకు బాలుడిని ఎత్తుకెళ్లి ఈ విధంగా చేశారనే విషయాలు విచారణలో తెలియాల్సి ఉంది.
తీవ్రగాయాలతో బాలుడి ఆచూకీ లభ్యం

ఇదీ చదవండి: etvbharat.page.link/RVk3aEZkbBArFUvs7

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details