రైలులో ప్రయాణిస్తున్న 18నెలల బాలిక అపహరణ(child kidnap) కేసును రాజమహేంద్రవరం జీఆర్పీ పోలీసులు ఛేదించారు. బాలికను అపహరించిన నామవరం శాటిలైట్ సిటీకి చెందిన భవానీ, సూత్రదారులు రామకృష్ణ, వెంకట రత్నంలను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలు లేని వారికి అమ్మేసి సొమ్ము చేసుకునేందుకు బాలికను అపహరించినట్టు పోలీసులు తేల్చారు. గత నెల 30న ఒడిశాకు చెందిన దంపతులు వారి పిల్లలతో సహా విశాఖ-కాచిగూడ రైలులో సికింద్రాబాద్ వెళ్తున్నారు.
kidnap case: బాలిక అపహరణ కేసును ఛేదించిన జీఆర్పీ పోలీసులు - తూర్పుగోదావరి జిల్లా నేర వార్తలు
రైలులో ప్రయాణిస్తున్న 18నెలల బాలిక అపహరణ(child kidnap) కేసును రాజమహేంద్రవరం జీఆర్పీ పోలీసులు ఛేదించారు. బాలికను అపహరించిన నామవరం శాటిలైట్ సిటీకి చెందిన భవానీ, సూత్రదారులు రామకృష్ణ, వెంకట రత్నంలను పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలిక అపహరణ కేసును చేధించిన జీఆర్పీ పోలీసులు
వీరితోపాటు నిందితురాలు భవానీ కూడా రైలులో ప్రయాణించింది. రైలులో నిద్రిస్తున్న 18 నెలల చిన్నారిని భవాని ఎత్తుకొని రాజమహేంద్రవరం స్టేషన్లో దిగింది. పాపను తీసుకొని వెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించి...నిందితుల్ని పట్టుకున్నారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. జీఆర్పీ డీఎస్పీ నాగేశ్వరరావు మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఇదీ చదవండి: