కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రోడ్డుపైకి రావొద్దని ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నారని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం ఎస్ఐ హరీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వారి తీరును తప్పుబట్టారు. అర గంట వ్యవధిలో 30 మంది నిబంధన అతిక్రమించారని చెప్పారు. ఇలా అయితే పోలీసులు విధులు ఎలా చేయగలరని ప్రశ్నించారు. పి.గన్నవరం మూడు రహదారుల కూడలిలో నడిరోడ్డుపై అందరినీ నిల్చోబెట్టారు. 30 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కోవిడ్-19 చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
లాక్డౌన్ను లెక్క చేయకుంటే.. ఇక కేసులే! - police counselling on people who bviloet rules
లాక్ డౌన్ ను లెక్క చేయకుండా రోడ్లపైకి వస్తున్న వారిపై తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం ఎస్ఐ హరీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే వారందరికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
![లాక్డౌన్ను లెక్క చేయకుంటే.. ఇక కేసులే! police councelling on people who violet the lockdown rules in east godavari dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6945910-1067-6945910-1587894264028.jpg)
ఇకపై నిబంధనలు అతిక్రమిస్తే కోవిడ్ చట్టంకింద కేసులే