తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని ముంగండ గ్రామానికి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. దీంతో ముంగండ నుంచి ఇసుకపూడి వెళ్లే ప్రధాన రహదారి మూసివేసినట్లు ఎస్సై సురేంద్ర వెల్లడించారు. కరోనా సోకిన కానిస్టేబుల్... జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం ఇంటికి వచ్చిన ఆయన కాకినాడ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థరణ కాగా... ఆ కానిస్టేబుల్ ముంగండ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరిని కలిశాడనే వివరాలను ఆరా తీస్తున్నారు. దీంతో అధికారులు, పోలీసులు ఆ గ్రామ ప్రజలను అప్రమత్తం చేసి... ఆ ప్రాంతంలో శానిటైజేషన్ పనులు చేస్తున్నారు.
కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్... రహదారి మూసివేత - తూర్పుగోదావరిలో కానిస్టేబుల్‌కు కరోనా
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని ముంగండ గ్రామానికి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయ్యింది. అప్రమత్తమైన అధికారులు కానిస్టేబుల్ నివసిస్తున్న ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి... శానిటైజేషన్ పనులు చేపడుతున్నారు.
పి.గన్నవరంలో కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్