ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Police Aspirants Protest: పోలీస్ ఉద్యోగార్థుల భారీ రాస్తారోకో - పోలీస్ ఉద్యోగాల ఖాళీలపై విద్యార్థుల ధర్నా

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఉద్యోగాల భర్తీ క్యాలెండర్​లో పోలీస్ కొలువుల ఖాళీలపై కాకినాడలో ఉద్యోగ ఆశావహులు రాస్తారోకో నిర్వహించారు. ఫలితంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్​ అయ్యింది.

Police Aspirants Protest : పోలీస్ ఉద్యోగార్థుల భారీ రాస్తారోకో
Police Aspirants Protest : పోలీస్ ఉద్యోగార్థుల భారీ రాస్తారోకో

By

Published : Jun 19, 2021, 10:18 PM IST

ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భర్తీ క్యాలెండర్​లో పోలీస్ ఉద్యోగాల ఖాళీలపై తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉద్యోగ ఆశావహులు రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. సుమారు 6,500 కానిస్టేబుల్ కొలువులను భర్తీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. జాబ్ క్యాలెండర్​లో కేవలం 450 ఖాళీలనే పేర్కొనడంపై ఆందోళన చేపట్టారు.

Police Aspirants Protest : పోలీస్ ఉద్యోగార్థుల భారీ రాస్తారోకో

భారీ మానవహారం..

పోలీస్ ఉద్యోగాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి కాకినాడలో భారీ సంఖ్యలో ఉద్యోగార్థులు, నిరుద్యోగులు శిక్షణ తీసుకుంటారు. ఈ క్రమంలో సర్కార్ నిర్ణయం ప్రకటించడంతో జడ్పీ సెంటర్​లో ఆశావహులు మానవహారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది నిరుద్యోగులు కానిస్టేబుల్ పోస్టులకు సిద్ధమవుతున్నారని.. ముఖ్యమంత్రి స్పందించి ఉద్యోగ ఖాళీలు పెంచాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి : Corona cases: రాష్ట్రంలో కొత్తగా 5,674 కరోనా కేసులు, 45 మరణాలు

ABOUT THE AUTHOR

...view details