ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల కవాతు - తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు తాజా సమాచారం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తూర్పుగోదావరి జిల్లాలో సందడి నెలకొంది. పలు ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

Police parade
పోలీసుల కవాతు

By

Published : Apr 5, 2021, 10:34 AM IST

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల సందడి మొదలైంది. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. రావులపాలెం సీఐ బి. కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సైలు బుజ్జి బాబు, శ్రీనివాస్ నాయక్, సురేంద్ర, నరేష్, సిబ్బంది గ్రామాల్లో పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు.. జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details