తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం కేశవరం రైల్వే గేటు దగ్గర అక్రమంగా నాటుసారాను తరలిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి 120 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కడియం మండలం మురముండ గ్రామానికి చెందిన బొజ్జా ఉపేంద్ర తన మోటార్ సైకిల్‌పై ప్లాస్టిక్ సంచులలో తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి సారాతో పాటు మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో 120 లీటర్ల నాటుసారా స్వాధీనం - నాటుసారా వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను పట్టుకున్నారు. నిందితుడి నుంచి సారాతో పాటు మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు
నాటుసారా స్వాధీనం