తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో పోలీసులు కరోనాపై వినూత్నరీతిలో అవగాహన కల్పించారు. సీఐ రాంబాబు సైకిల్‌పై తిరుగుతూ వైరస్ వల్ల కలిగే అనర్థాలు వివరించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం శ్రమిస్తోన్న పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు.
సైకిల్‌పై ప్రచారం.. కరోనా వ్యాప్తి నివారణే లక్ష్యం.. - police awareness on corona news
లాక్డౌన్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పరిధిలో పోలీసులు ఇప్పటికే అనేక విధాలుగా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం సైకిల్‌పై సవారీ చేస్తూ వైరస్‌పై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు.

కరోనా కట్టడికి... 'సైకిల్' వారధి