తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం పెరుమల్లపురం వద్ద ఉద్రిత్త వాతావరణం నెలకొంది. గ్రామంలో కోడి పందేలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు తనిఖీలకు వెళ్లారు. వారిపై.. కోడి పందేల రాయుళ్లు దాడికి పాల్పడ్డారు. ఘటనలో ఏఎస్ఐ, హోంగార్డ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఇద్దరినీ సమీప ఆసుపత్రికి తరలించారు.
కోడిపందేల రాయుళ్ల దాడి... ఇద్దరు పోలీసులకు గాయాలు - police attacks on kodipandelu bettings
కోడిపందేల నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కొందరు బేఖాతరు చేస్తున్నారు. చాటుమాటున ఈ పందేలను కానిచ్చేస్తున్నారు. అడ్డు వచ్చిన పోలీసులను గాయపరుస్తున్నారు. ఇలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లా పెరుమల్లపురం వద్ద చోటుచేసుకుంది.
పోలీసులపై కోడిపందేల రాయుళ్లు దాడి... ఇద్దరికి గాయాలు
TAGGED:
latest news on kodipandelu