తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో కోడి పందేలు ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వెదిరేశ్వరంలో కోడి పందేలు ఆడుతున్నట్లు సమాచారం రావడంతో రావులపాలెం సీఐ వి. కృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందితో... కోడి పందేలు ఆడుతున్న ప్రదేశం వద్ద దాడులు నిర్వహించి 11 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. నిందితుల నుంచి రూ.1,21,895 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఐదు కార్లు, 8 ద్విచక్ర వాహనాలు, 12 సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు ఎస్సై బుజ్జి బాబు వెల్లడించారు.
11 మంది పందెం రాయుళ్లు అరెస్టు... రూ.లక్షకు పైగా నగదు స్వాధీనం - వెదిరేశ్వరం కోడి పందేలు వార్తలు
కోడి పందేలు నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా.. పందెంరాయుళ్లు ఆగడం లేదు. ఆంక్షలు ఉల్లంఘించి పందేలు నిర్వహిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా వెదిరేశ్వరంలో జరిగింది.
11 మంది పందెం రాయుళ్లు అరెస్టు