ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోరీ కేసులో ఇద్దరిని అదుపులో తీసుకున్న పోలీసులు - తూర్పుగోదావరి జిల్లా నేర వార్తలు

ఇంద్రపాలెం, బొమ్మూరు పోలీస్​స్టేషన్​ల పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న బాల నేరస్తుడు, మరో యువకుడిని ఇంద్రపాలెం పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

చోరీ కేసులో ఇద్దరిని అదుపులో తీసుకున్న పోలీసులు
చోరీ కేసులో ఇద్దరిని అదుపులో తీసుకున్న పోలీసులు

By

Published : Nov 11, 2020, 6:44 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఇంద్రపాలెం, బొమ్మూరు పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ బాల నేరస్తుడు, మరో యవకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, 104 గ్రాముల బంగారం, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ భీమరావు తెలిపారు. ఎస్పీ అద్నాన్ నయీంమ్ అస్మి అదేశాల మేరకు జగన్నాథపురానికి చెందిన బాలనేరస్తుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంద్రపాలెం, బొమ్మూరులో జరిగిన దొంగతనాలు అతనే చేసినట్లు విచారణలో వెల్లడైందని అన్నారు. చోరీ సొత్తు జవ్వాది మణికంఠ అనే యువకుడి వద్ద ఉండటంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ పేర్కొన్నారు. బాలనేరస్తుడిపై సుమారు 30 దొంగతనాల కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details