Police arrested TDP leaders: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో అమరావతి పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన తెదేపా కార్యకర్తలు, నాయకులు రావులపాలెం చేరుకుని అక్కడి నుంచి అమరావతి పాదయాత్రకు వెళ్తున్న తరుణంలో పోలీసులు.. అనుమతి లేదని అడ్డగించారు. వారి కార్లను వెళ్లకుండా నిలుపుదల చేయడంతో.. తాము కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తామని వెళ్తున్న వారిని జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన చేశారు. బండారు సత్యానందరావు, రాష్ట్ర తెదేపా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీస్ స్టేషన్కు కూడా తెదేపా నేతలు ఆందోళన చేశారు.
TDP leaders arrest: పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తెదేపా నేతల అరెస్ట్ - రావులపాలెంలో పాదయాత్రకు వెళ్తున్న నేతల అరెస్ట్
Police arrested TDP leaders: తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రావులపాలెం మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును పీఎస్కు తరలించారు. వాహనాలను ముందుకు వెళ్లకుండా నిలువరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తమ నాయకులను అదుపులోకి తీసుకోవటంతో రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు ధర్నాకు దిగారు.
తెదేపా నాయకుల అరెస్ట్