తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి పరిధిలో నకిలీ మద్యం తయరీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.వారి వద్ద నుంచి 18 నకిలీ మద్యం సీసాలతో పాటు.. రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. పశువుల వైద్యానికి వాడే హోమియోపతి ద్రావణం ,నీరు, ఫుడ్ కలర్ ఇలా మూడింటినీ కలిపి నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టుచేశారు. రాజోలు డీఎస్పీ, అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా మద్యం వివరాలను వెల్లడించారు. అప్పన రాముని లంక గ్రామానికి చెందిన అడపా శ్రీను, అంతర్వేదికి చెందిన నల్లి రాజేష్, మలికిపురంకి చెందిన కటికి రెడ్డి శ్రీనివాస్ ముగ్గురూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ మద్యం తయారీకి అలవాటు పడ్డారు. ఇలా తయారు చేసిన నకిలీ మద్యాన్ని పేరుగాంచిన బ్రాండ్లకు చెందిన బాటిళ్లల్లో నింపి విక్రయిస్తున్నారు.
కోనసీమలో నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్టు - కోనసీమలో నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్టు
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి పరిధిలో నకిలీ మద్యం తయరీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.వారి వద్ద నుంచి 18 నకిలీ మద్యం సీసాలతో పాటు.. రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
కోనసీమలో నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్టు