తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 23 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
మండల కేంద్రంలోని ఓ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 19వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్లలో పేకాట ఆడుతున్న మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరనీ కోర్టులో హాజరు పరిచారు.