తూర్పు గోదావరి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం మన్యంలోని చింతూరులో నిర్వహించిన జాబ్‌మేళాలో 1,186 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఏజెన్సీలో గంజాయి సాగు, రవాణా, మావోయిస్టుల ప్రాబల్యం తదితర అంశాల నేపథ్యంలో ఎస్పీ రవీంద్రబాబు ఇటీవల పర్యటించారు. ఇక్కడ ఉన్నత విద్యావంతులైన యువత నిరుద్యోగులుగా ఉండడం గమనించారు. అలాంటి వారికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పీవీఎస్ఆర్ గ్రూప్ ద్వారా 27 కంపెనీలతో ఉద్యోగ మేళా నిర్వహించారు. దీనిపై కొద్ది రోజులుగా గ్రామాల్లో ప్రచారం చేశారు. ఇద్దరు యువకులు ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థలో రూ.10 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యారు.
job mela: పోలీసుల ఆధ్వర్యంలో బాజ్ మేళా.. మన్యంలో 1,186 మంది ఎంపిక - police arrange job mela in chintoor
తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. చింతూరులో నిర్వహించిన ఈ మేళాలో మన్యంలో 1,186మంది ఎంపికయ్యారు.
job mela