తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున.. వాటికి నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరిగే వారిపై ప్రత్యక దృష్టి పెట్టారు. కాకినాడలో రద్దీ ప్రాంతమైన జడ్పీ కూడలిలో నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు పెట్టకుండా వాహనాల్లో తిరిగే వారిని ఆపి అవగాహన కల్పించారు.
అలాగే.. 120 రూపాయల చొప్పున అపరాధ రుసుం విధించారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ట్రాఫిక్ డీఎస్పీ మురళీకృష్ణా రెడ్డి మాస్క్ డ్రైవ్లో పాల్గొన్నారు. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా... ప్రజలు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.