ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల వినూత్న ప్రయత్నం: 'మాస్కు పెట్టుకోకపోతే మూర్ఖులే!' - రావులపాలెంలో మాస్కు పెట్టుకోని వారిపై పోలీసుల చర్యల వార్తలు

కరోనా విస్తరిస్తున్న తరుణంలో జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే చెప్తున్నా.. చాలామంది వినిపించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా మాస్కులు పెట్టుకోకుండా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. అలాంటి వారికి తూర్పుగోదావరి జిల్లా పోలీసులు వినూత్న శిక్ష వేశారు.

police action on persons who wearing no mask in ravulapalem
మాస్కు పెట్టుకోకపోతే మూర్ఖులే!

By

Published : Jun 21, 2020, 9:28 AM IST

కరోనా నేపథ్యంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని.. పెట్టుకోని వారిపై కఠిన చర్యలు ఉంటాయని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. రావులపాలెంలో రహదారిపై మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వారిపై సీఐ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

'నేను మూర్ఖుడిని.. అందుకే మాస్కు పెట్టుకోలేదు' అని రాసున్న ప్లకార్డుల్ని వారికిచ్చి రోడ్డుపై నిలబెట్టారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే శిక్షలు ఇలాగే ఉంటాయని హెచ్చరించారు. కరోనా కట్టడికి బాధ్యతో సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details