తూర్పుగోదావరి జిల్లా పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులు తోటపల్లిలో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తుందే తప్ప తమ గోడును పట్టించుకోవటం లేదని వారు వాపోయారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే విలీన మండలాలు జలసమాధి అవుతాయన్నారు. చిన్నపాటి వర్షాలకే ముంపు మండలాలు నీట మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. 2013 చట్ట ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా 2006లో పరిహారం తీసుకున్న రైతులకు ఎకరాకు 5 లక్షలు ఇవ్వాలని కోరారు. సర్వం కోల్పోయిన ముంపు ప్రాంత ప్రజల పట్ల నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. ముంపు మండలాల నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
'ముందు పరిహారం.. తరువాతే ప్రాజెక్టు నిర్మాణం' - in thotaplli polavaram villagers meeting
తూర్పుగోదావరి జిల్లా పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులు తోటపల్లిలో సమావేశమయ్యారు. ప్రాజెక్టు నిర్మిస్తున్నారు కానీ.. తమకు ఇవ్వాల్సిన పరిహారం ప్రభుత్వం చెల్లించడం లేదని వాపోయారు.
పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితు సమావేశం