ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రెండు నెలల్లో పోలవరం ప్యాకేజీ పూర్తి స్థాయిలో చెల్లిస్తాం' - polavaram latest news

పోలవరం ముంపు బాధితులకు రెండు నెలల్లో పూర్తి స్థాయి ప్యాకేజీలు చెల్లించనున్నట్లు పునరావాస ప్రత్యేక అధికారి ఆనంద్ చెప్పారు. దేవీపట్నం మండలంలోని 8 ముంపు గ్రామాల నిర్వాసితులకు ప్రభుత్వం రూ. 80 కోట్ల మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసిందన్నారు.

polavaram special officer
పోలవరం ముంపు మండలాలపై ప్రత్యేక అధికారి

By

Published : Apr 1, 2021, 7:18 PM IST

పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు రెండు నెలల్లో పూర్తిస్థాయిలో ప్యాకేజీలు చెల్లిస్తామని పునరావాస ప్రత్యేక అధికారి ఆనంద్ తెలిపారు. దేవీపట్నం మండలంలో ముంపు బాధితులకు నిర్మించిన కాలనీలను ఆయన సందర్శించారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో మాట్లాడారు. దేవీపట్నం మండలంలోని ఎనిమిది గ్రామాల నిర్వాసితులకు ప్రభుత్వం రూ.80 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందన్నారు.

అర్హులైన నిర్వాసితులకు ప్యాకేజీలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులకు అన్యాయం జరిగితే నేరుగా తమను సంప్రదించవచ్చని చెప్పారు. అటువంటి వారికోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్ సైట్​ను ఏర్పాటు చేసిందనట్లు చెప్పారు. ఆ దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలిస్తారని.. ఉన్నతాధికారులకు నివేదించిన తర్వాత పరిహారం అందజేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details