పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో పాల్గొంటున్న వలస కూలీలను... కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు.. వారి స్వస్థలాలకు పంపిస్తామని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు.
కరోనా ఆందోళనతో కూలీలను.. ప్రస్తుతం నన్నయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచామన్నారు. కానీ స్వగ్రామాలకు పంపాలంటూ కూలీలు పట్టుపడుతున్నారని తెలిపారు. అనుమతులు రాగానే వారిని రైళ్లలో తరలిస్తామని చెప్పారు.