2018లో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో జరిగిన ఆదివాసీ మహాసభ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ప్రాజెక్టు ముంపు బాధితులకు.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్యాకేజీ చెల్లించకుండానే ఆగస్టులోగా గ్రామాలను ఖాళీ చేయించాలని చూడటం దారుణమన్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి రూ.24.75లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి' - polavaram project
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని ఆదివాసి మహాసభ న్యాయ సలహాదారుడు డిమాండ్ చేశారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రంపచోడవరంలో పోలవరం నిర్వాసితుల ఆందోళన