ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏళ్లు గడుస్తున్నా పునరావాస ప్యాకేజీ చెల్లించరా?' - పరిహారంపై పోలవరం నిర్వాసితుల కామెంట్స్

ఏళ్లు గడుస్తున్నా నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అందించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని పోలవరం నిర్వాసితుల కమిటీ ఆగ్రహించింది. ఇప్పటికైనా న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.

polavaram Expatriates on compensation
polavaram Expatriates on compensation

By

Published : Sep 9, 2020, 11:31 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో బుధవారం పోలవరం నిర్వాసితుల సమస్యలపై నిర్వాసితుల కమిటీ సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో దేవీపట్నం, చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఏటపాక మండలాల్లో 85 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని నిర్వాసితుల కమిటీ ప్రతినిధులు తెలిపారు. పూర్తిస్థాయిలో పునరావాస ప్యాకేజీ ని చెల్లించకుండా గ్రామాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడం దారుణమన్నారు.

గత ఏడాది గోదావరి వరదలతో మన్యంలో పలు గ్రామాలు ముంపునకు గురవడంతో అప్పట్లో సీఎం జగన్ పర్యటించి పూర్తిస్థాయిలో ప్యాకేజీ చెల్లిస్తామని, నష్టపోయిన ఇళ్లకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నేటికీ అమలు చేయలేదని ఆగ్రహించారు. ఇటీవలి గోదావరి వరదలతో మరోసారి ముంపునకు గురై సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో ప్యాకేజీ చెల్లించిన తర్వాతే తామంతా గ్రామాలను ఖాళీ చేస్తామని కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details