పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ప్యాకేజీ చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈవో చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట, కంబలం పాలెంలోని పునరావాస కాలనీలను ఆయన సందర్శించారు.
కాలనీ నిర్మాణాలను వచ్చే మార్చిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశంచారు. భూములకు సంబంధించి ప్యాకేజీని చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.