తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల చెరువులోని ఓ ఇంట్లో పాము కలకలం రేపింది. కుంచే శ్రీనివాస్ ఇంట్లో పాము బుసలు కొడుతున్న శబ్దం పదేపదే వినిపిస్తూ ఉండేది. మొదట అంతగా పట్టించుకోకున్నా.. ఆ తర్వాత అనుమానం వచ్చి ఇల్లంతా వెతికాడు. శబ్ధాలు వాషింగ్ మిషన్ నుంచి వస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే డోర్ తెరిచి చూడగా.. నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతూ కనిపించింది.
SNAKE: బాబోయ్ పాము..చూసి పరుగో పరుగు - నాగుపాము
ఓ నాగుపాము వాషింగ్ మెషిన్ (Washing Mechine)లో దూరి కలకలం రేపింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మహిపాలచెరువు గ్రామంలో జరిగింది.

వాషింగ్ మిషన్ లో విషనాగు
వాషింగ్ మిషన్ లో విషనాగు
పామును చూసి భయానికి గురైన శ్రీనివాస్..వెంటనే పాములు పట్టే వర్మకు సమాచారమిచ్చాడు. వెంటనే వర్మ వచ్చి చాకచక్యంగా విషసర్పాన్ని ప్లాస్టిక్ డబ్బాలోకి పంపించాడు. పామును దూరంలోని పొలాల మధ్య వదిలివేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: sand art on women harassment: పుట్టడమే పాపమా..??