ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభల తీర్థంపై ప్రధాని స్పందన... ఉత్సాహంలో కోనసీమ యువత - ప్రబల తీర్థాల విశిష్టత

ప్రభల తీర్థాలకు కోనసీమ ముస్తాబైంది. ఈ వేడుక విశిష్టతపై తూర్పు గోదావరి జిల్లా గంగలకుర్రు అగ్రహారానికి చెందిన సతీష్ అనే యువకుడు పంపిన ఈ మెయిల్​కు.. ప్రధాని మోదీ నుంచి స్పందన వచ్చింది. ప్రజలకు అభినందనలు తెలుపుతూ.. మోదీ సందేశం పంపించారు.

pm narendramodi letter to konasama people at east godavri district
ప్రధాని నుంచి వచ్చిన లేఖ

By

Published : Jan 15, 2020, 4:22 PM IST

ప్రధానమంత్రి ఆశీస్సులతో ...ఉత్సవాలను ఇంకా బాగా జరుపుతాం

సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు కోనసీమ వ్యాప్తంగా ప్రభలతీర్థాలు నిర్వహిస్తారు. ఇవి సుమారు 175 గ్రామాలో జరుగుతాయి. వీటిలో అత్యంత ప్రాముఖ్యమైనది తూర్పు గోదావరి జిల్లా జగ్గన్న తోట ప్రభల తీర్థం. ఈ వేడుకకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. అనాదిగా.. ఆనవాయితీగా వస్తున్న ఈ తీర్థం గురించి గంగలకుర్రు అగ్రహారానికి చెందిన సతీష్ అనే యువకుడు ప్రధాని మోదీకి ఈ మెయిల్ ద్వారా తెలియజేశారు. స్పందించిన ప్రధాని.. ప్రభల తీర్థాలపై ఆసక్తి కనబరిచారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగ్గన్నతోట ప్రభల తీర్థంలో కొలువుదీరే ఏకాదశ రుద్రుల ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ మెయిల్​ ద్వారా ఆకాంక్షించారు. ఈ ఉత్సాహంతో మరింత ఘనంగా ప్రభల తీర్థాన్ని నిర్వహించేందుకు జగ్గన్న తోట వాసులు ప్రభలు సిద్ధం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details