తూర్పుగోదావరి జిల్లా రాజోలు బాలుర జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ప్లాస్టిక్ బియ్యం ఇచ్చారంటూ ప్రచారం జరిగింది. ఏడవ తరగతి విద్యార్థులకు జులై 31న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా బియ్యం పంపిణీ చేశారు. విద్యార్థులు తీసుకున్న కొన్ని బియ్యం భిన్నంగా ఉండటంతో అవి ప్లాస్టిక్ బియ్యం అంటూ విద్యార్థులు తల్లిదండ్రులు భయపడి ఏడవ తరగతి విద్యార్థులకు చెందిన వాట్సప్ గ్రూపులో పోస్ట్ పెట్టడంతో విషయం వైరల్ అయ్యింది.
రాజోలు పాఠశాలలో ప్లాస్టిక్ బియ్యం కలకలం..తల్లిదండ్రుల ఆందోళన - ఆంధ్రప్రదేశ్ వార్తలు
రాజోలు బాలుర జడ్పి పాఠశాలలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. విద్యార్థులకు జులై 31న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా బియ్యం పంపిణీ చేశారు. విద్యార్థులు తీసుకున్న కొన్ని బియ్యం భిన్నంగా ఉండటంతో.. అవి ప్లాస్టిక్ బియ్యం అంటూ విద్యార్థులు తల్లిదండ్రులు బయపడగా పౌర సరఫరాలశాఖాధికారులు పాఠశాలకు చేరుకుని పరిశీలించి అవి ఫొర్టిపైడ్ బియ్యమని తేల్చి చెప్పారు.
ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు విషయాన్ని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని మండల విద్యాశాకాధికారి విజయశ్రీ తహసీల్దార్ ముక్తేశ్వరరావుకు వివరించగా ఆయన పౌర సరఫరాలశాఖాధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు పాఠశాలకు చేరుకుని బియ్యాన్ని పరిశీలించారు. అవి ఫొర్టిపైడ్ బియ్యమని, సదరు బియ్యం పోషక పదార్ధాలతో తయారు చేసిన పిండి పదార్థమే తప్ప ప్లాస్టిక్ బియ్యం కాదని తేల్చి చెప్పారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చదవండి: