ప్లాస్టిక్ భూతం..భావి తరాల మనుగడకు ప్రశ్నార్థకం - plastic awareness program in east godavari
తుని సిటీ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ రహిత సంచులను పంపిణీ చేసారు. ప్లాస్టిక్‌ను నిరోధించకపోతే భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ప్రచారం చేశారు.
![ప్లాస్టిక్ భూతం..భావి తరాల మనుగడకు ప్రశ్నార్థకం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4623367-thumbnail-3x2-tuni.jpg)
plastic
ప్లాస్టిక్ భూతం-భావి తరాల మనుగడకు ప్రశ్నార్థకం
తూర్పుగోదావరి జిల్లా తునిలో సిటీ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత పర్యావరణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా... పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ముద్రించిన ప్లాస్టిక్ రహిత సంచులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల జీవజాలంపై దుష్ప్రభావం పడుతుందని వారన్నారు. వీటి వినియోగాన్ని ఇప్పటికైనా నిరోధించకపోతే భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఇకనుంచి వందలాది సంచులను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.