రాజమండ్రి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన దామెర హరిబాబు ఇంటి ఆవరణలో పెరిగిన సీతాఫలం చెట్టుకు గులాబిరంగులో కాయలు కాస్తున్నాయి. తమ పూర్వీకులు ఈ మొక్కను ఎక్కడ నుంచి తెచ్చారో తనకు తెలియదని, సుమారు 30 ఏళ్లుగా ఈ కాయలు కాస్తుందన్నారు. ఇవి అరుదైన రకమని ఉద్యానశాఖాధికారిణి సత్యశైలజ తెలిపారు. దీని శాస్త్రీయనామం పింక్ మమాత్ అని, ఇది ఆస్ట్రేలియాలో అధికంగా ఉంటుందన్నారు. దీని గుజ్జు తీపి తక్కువగా ఉంటుందని, ఈ చెట్టు 60 సంవత్సరాల కాలంపాటు నిలిచి ఉంటుందని ఆమె చెప్పారు.
CUSTARD APPLE: గులాబీ రంగు సీతాఫలం...ఎక్కడో తెలుసా..! - ap latest news
ఆకుపచ్చ రంగులో ఉండే సీతాఫలాలను అందరం చూసి, తినే ఉంటాం.. కానీ గులాబీ రంగులో ఉండే సీతాఫలం గురించి ఎవరైనా విన్నారా..! ఏంటి గులాబీ రంగు సీతాఫలం కూడా ఉంటుందా అనుకుంటున్నారా! అవునండి. నిజంగానే సీతాఫలాలు గులాబీ రంగులో కాస్తున్నాయి. తినడానికి తీపి కాస్త తక్కువగా అనిపించినా.. అరుదైన రకం కాబట్టి అందరూ ఆ పండ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు.
గులాబీ వర్ణంలో ఘుమఘుమలాడుతున్న సీతాఫలం