వైకాపా గూటికి చేరిన తోట త్రిమూర్తులుపై.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఆయన వాహన శ్రేణిని ఎస్సీలు అడ్డుకున్నారు. శిరోముండనం కేసుపై తోట త్రిమూర్తులును శిక్షించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేసు చివరి దశకు చేరుకున్న సమయంలో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులను వైకాపాలో ఎందుకు చేర్చుకున్నారని నిలదీశారు.
పార్టీలో చేరినా... తోట త్రిమూర్తులు నాకు శత్రువే! - తోట త్రిమూర్తులును శిక్షించాలని దళిత సంఘాల డిమాండ్
శిరోముండనం కేసుపై తోట త్రిమూర్తులును శిక్షించాలని దళిత సంఘాల నేతలు ద్రాక్షారామంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వాహన శ్రేణిని అడ్డుకున్నారు. ఆ కేసు కోర్టులో ఉందని... ఎస్సీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పిల్లి సుభాష్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తోటపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దళిత సంఘాల నేతలతో మాట్లాడుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్
వారికి సమాధానం ఇచ్చిన పిల్లి సుభాష్... పార్టీలో చేరినా తోట త్రిమూర్తులు తనకెప్పుడూ శత్రువే అని తేల్చి చెప్పారు. ఎస్సీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శిరోముండనం కేసు కోర్టులో ఉందని... బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
Last Updated : Sep 18, 2019, 5:36 PM IST