సంక్షేమ పథకాల అమలులో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా నేత పిల్లి సత్తిబాబు విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ఎక్కడిపనులను అక్కడే వదిలేసి రాష్ట్రాభివృద్ధిని ఆపేశారన్నారు. పోలవరం కోసం చంద్రబాబు అహర్నిశలు శ్రమించారన్నారు. ప్రత్యక హోదా విషయాన్ని పూర్తిగా మరిచిన వైకాపా.... ఓ చేతిలో ప్రభుత్వ పథకాలు పెట్టి మరో చేతి నుంచి టాక్స్ రూపంలో వసూలు చేస్తోందని మండిపడ్డారు. కరెంటు,ఇంధన ధరలు పెంచి ప్రజలను ఇక్కట్ల పాల్జేస్తున్నారని సత్తిబాబు మండిపడ్డారు. ఇసుక కొరత సృష్టించి భవననిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని దుయ్యబట్టారు.
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం: పిల్లి సత్తిబాబు - ప్రభుత్వంపై పిల్లి సత్తిబాబు విమర్శలు
మూడు రాజధానుల పేరుతో వైకాపా ప్రభుత్వం ఎక్కడిపనులను అక్కడే వదిలేసి రాష్ట్రాభివృద్ధిని ఆపేశారని తెదేపా నేత పిల్లి సత్తిబాబు విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం