కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిక్కిరిశాయి. ఏడు శనివారాల నోము నోచుకునే మహిళలు తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో తరలిరావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. చాలామంది స్వామివారి దర్శనం కోసం బయటనే వేచి ఉన్నారు. భక్తులకు దేవాదాయశాఖ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.
వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ - వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం
తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఏడు శనివారాల నోము సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.
వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ