పిడుగు పడి పశువులు మృతి
పిడుగుపాటుకు గురై రెండు పశువుల మృతి - mruti
తూర్పుగోదావరి జిల్లా ఒమ్మంగిలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులు,ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పిడుగుపాటుకు గురై రెండు పశువులు మృతిచెందాయి.
![పిడుగుపాటుకు గురై రెండు పశువుల మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3464299-230-3464299-1559595580234.jpg)
గేదెలు
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో వర్షం కురిసింది. గ్రామానికి చెందిన రైతు ఉమ్మిడి అర్జునుడు గేదెలు చెట్టుకింద ఉండగా పిడుగు పడటంతో గేదె, గేదె దూడ మృతి చెందాయి. వీటి విలువ 80 వేల రూపాయలు వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. తన జీవనాధారమైన పశువులు చనిపోవటం చూసి రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.