రాజమహేంద్రవరం కేంద్రకారాగారం ఖైదీల ఆధ్వర్యంలో నిర్వహించేందుకు... పెట్రోల్ బంకు ఏర్పాటుచేశారు. జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చే చర్యల్లో భాగంగా.. పెట్రోల్ బంకు నిర్వహణ సిబ్బందిగా నియమిస్తునట్లు తెలిపారు. సుమారు రూ.4 కోట్లలతో నిర్మించిన ఈ బంకులో మొత్తం 60 మంది సిబ్బంది పనిచేస్తారని చెప్పారు.
కేంద్ర కారాగారం ఆధ్వర్యంలో బంకు.. ఖైదీలే సిబ్బంది - కేంద్రకారాగారం
ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా.. పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు తెలిపారు. రాజమహేంద్రవరం కేంద్రకారాగారం ఆధ్వర్యంలో నిర్వహించే నూతన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు.
కేంద్రకారాగారం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు...ఖైదీలే సిబ్బంది
వినియోగదారుల కోసం... స్వీట్ స్టాల్, కార్‌వాష్, అరకు కాఫీ స్టాల్‌తో పాటు.. మరిన్ని ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఈ బంకును మరింత విస్తరిస్తామని తెలిపారు. జైళ్లలో ఉండే ఖైదీల మాసనిక పరివర్తన తీసుకొచ్చే విధంగా ఇటువంటి చర్యలు చేపడుతున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. కేంద్రకారాగారం సూపరింటెండెంట్ సాయిరామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : పార్టీనేతలతో పవన్‌కల్యాణ్ సమావేశం