తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం-రాజమండ్రి ఏబీడీ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రయాణికులతో కూడిన టాటా మ్యాజిక్ వాహనం రాజమండ్రికి వెళుతుండగా లారీ ఢీకొట్టింది. దాంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
లారీ-టాటా మ్యాజిక్ వాహనం ఢీ.. 8మందికి గాయాలు - road accident at peddapuram
టాటా మ్యాజిక్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఎనిమిది మంది గాయాల పాలయ్యారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం రాజమండ్రి ఏబీడీ రోడ్డుపై జరిగింది.

లారీ, టాటా మ్యాజిక్ వాహనం ఢీ