ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరిలో వ్యక్తి గల్లంతు..ఇంకా దొరకని ఆచూకీ - గోదావరిలో వ్యక్తి గల్లంతు.. దొరకని ఆచూకీ

తూర్పుగోదావరి జిల్లా చోడవరంలో ఆదివారం రాత్రి గల్లంతైన శోభన్​బాబు అనే వ్యక్తి కోసం అధికారులు సరిగ్గా గాలింపు చర్యలు చేపట్టడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే అలాంటిదేమీ లేదని ఏపీఎస్​ఆర్డీఎఫ్ బృందాలతో గాలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

గోదావరిలో వ్యక్తి గల్లంతు.. దొరకని ఆచూకీ

By

Published : Sep 9, 2019, 7:51 PM IST

తూర్పుగోదావరి జిల్లా చోడవరంలో ఆదివారం రాత్రి గల్లంతైన శోభన్​బాబు కోసం అధికారులు సరిగ్గా గాలింపు చర్యలు చేపట్టడం లేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. నిన్న రాత్రి చోడవరం-నెల్లిపాక మధ్య జాతీయరహదారి కల్వర్టు పైనుంచి అతను గోదావరిలో జారిపడ్డాడు. ఆ సమయంలో నది ఉద్ధృతి అధికంగా ఉందనీ.. దీంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకూ అతని ఆచూకీ దొరకలేదనీ.. అధికారులు పూర్తిస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టడం లేదని శోభన్​బాబు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అలాంటిదేమీ లేదని ఏపీఎస్​ఆర్డీఎఫ్ బృందాలతో గాలిస్తున్నామనీ.. ప్రత్యేకంగా వలలూ ఏర్పాటు చేశామని అధికారులు వివరణ ఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details