రోడ్డు ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెంకు చెందిన ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో.. రాజేష్ అనే వ్యక్తికి దెబ్బలు తగిలాయని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం అతడిని స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఓ వాహనం ముందు భాగం ఛిద్రమైంది. మరో వాహనంపై ఇద్దరు ఉన్నారని.. వారికి ఏమీ కాలేదని వివరించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ద్విచక్ర వాహనాలు ఢీ.. ఓ యువకుడికి గాయాలు - person injured in two wheelers accident at p.gannavaram mandal
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేష్ అనే యువకుడు గాయాలపాలయ్యాడు. స్థానికులు హుటాహుటిన అతడిని దగ్గర్లోని సామాజిక ఆసుపత్రికి తరలించారు.
![ద్విచక్ర వాహనాలు ఢీ.. ఓ యువకుడికి గాయాలు bike accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9528064-1083-9528064-1605199953313.jpg)
ప్రమాదంలో గాయపడిన యువకుడు