గండేపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈనెల 26న ద్విచక్రవాహనంపై వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో వీరబాబు అక్కడికక్కడే మృతి చెందగా... నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.
వాడపల్లి కొత్త వంతెన వద్దకు వచ్చేసరికి వంతెన అప్రోచ్ స్తంభాన్ని ఢీకొని పడిపోయారు. క్షతగాత్రుడు నాగరాజును కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్ తెలిపారు.