తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఖాళీగా ఉన్న వ్రత పురోహితుల పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ దేవాదాయ శాఖ అడిషినల్ కమిషనర్ రామచంద్ర మోహన్ అదేశాలిచ్చారు. దేవస్థానంలో 260 మంది పురోహితులకుగాను 224 మంది ఉండగా 36 మంది నియామకానికి చర్యలు చేపట్టారు. ఖాళీల నియామకానికి సంబంధించి అర్హత, వయస్సుపై స్పష్టత ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేసి కమిషనర్‌కు అధికారులు లేఖ రాశారు.
అన్నవరం వ్రత పురోహితుల పోస్టుల భర్తీకి అనుమతులు - తూర్పు గోదావరి జిల్లా అన్నవరం వార్తలు
అన్నవరం దేవస్థానంలో ఖాళీగా ఉన్న వ్రత పురోహితుల పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ దేవాదాయ శాఖ అడిషినల్ కమిషనర్ రామచంద్ర మోహన్ అదేశాలిచ్చారు. ప్రత్యేకంగా సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ ఆర్జేసి పర్యవేక్షణ లో నియామకం చేపట్టాలని అదేశాల్లో పేర్కొన్నారు.
అన్నవరం వ్రత పురోహితుల పోస్టుల భర్తీకి అనుమతులు
మూడో తరగతి పురోహితుల ఖాళీలను నిబంధనల ప్రకారం వ్రత ఆదాయంలో 30 శాతం పారితోషకంగా చెల్లించే విధంగా భర్తీ చేయాలని ఆదేశించారు. 2012 ఏప్రిల్ 20న ఇచ్చిన కార్యాలయ అదేశాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. మంత్రాలు పఠించడంలో బాగా ప్రావీణ్యం ఉండి, వ్రతాలు చేయడానికి శారీరకంగా దృఢత్వంతో ఉండి అన్ని విధాలా సరిపోయే వారిని ఎంపిక చేసి, అర్హతలు పరిశీలించి భర్తీ చేయాలని అదేశాల్లో పేర్కొన్నారు.
ఇవీ చూడండి...