ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరంలో పెళ్లిళ్లకు అనుమతి

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు అధికారులు అనుమతించారు. పరిమిత సంఖ్యలో, నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకునేందుకు దేవస్థానం అధికారులు చర్యలు చేపడుతున్నారు. నాలుగైదు రోజుల్లో ముందస్తు రిజర్వేషన్లు ప్రారంభించనున్నారు.

Permission to marriages at annavaram
అన్నవరంలో పెళ్లిళ్లకు అనుమతి

By

Published : Oct 13, 2020, 7:46 AM IST

కొవిడ్ నిబంధనలు సడలిస్తుండటంతో తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో వివాహాలు చేసుకునేందుకు అధికారులు అనుమతించారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20 నుంచి స్వామివారి దర్శనాలతో పాటు దేవస్థానంలో వివాహాలు నిలిపివేశారు. ప్రస్తుతం కొవిడ్ నిబంధనలు సడలించి స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నా.. పెళ్లిళ్లకు మాత్రం ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు.

వివాహ ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో, నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకునేందుకు దేవస్థానంలో కళ్యాణమండపాలు, హాళ్లు, స్థలాలు కేటాయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. నాలుగైదు రోజుల్లో ముందస్తు రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని ఆలయ ఈఓ త్రినాథరావు తెలిపారు.

ఇదీ చదవండి: మోటర్లకు మీటర్లతో.. రైతులపై భారం పడదు: సీఎం

ABOUT THE AUTHOR

...view details