లాక్ డౌన్ కారణంగా నేటి నుంచి ప్రభుత్వం బియ్యం, శనగలు పంపిణీ చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో నెట్వర్క్ సరిగా పనిచేయని కారణంగా సరకుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న శనగలు నాసిరకంగా ఉన్నాయని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెట్వర్క్లో సమస్యలు... లబ్దిదారులకు అవస్థలు - ration holders in ap
నేటి నుంచి రాష్ట్రంలో రెండో విడత బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే కొన్ని ప్రాంతాలలో నెట్వర్క్ సరిగా లేకపోవడంతో సరకుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా లబ్దిదారులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.
రేషన్ దుకాణాల్లో సాంకేతిక సమస్యలతో ప్రజల అవస్థలు