ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడవిలో ఇళ్ల స్థలాలు వద్దని మల్లిసాల గ్రామస్థుల ధర్నా - తూర్పు గోదావరి తాజా వార్తలు

ఊరికి దూరంగా అడవిలో ఇళ్ల స్థలాలు వద్దని నిరసన తెలుపుతూ... తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ప్రజలు ధర్నా నిర్వహించారు. అడవిలో స్థలాలు ఇస్తే ఎలా ఉంటామని అధికారులను నిలదీశారు.

peoples protes
అడవిలో ఇళ్ల స్థలాలు వద్దని నిరసన t

By

Published : Dec 15, 2020, 4:15 PM IST

నిరుపేదల కోసం ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల పట్టాలను అడవికి చేరువలో ఉండటాన్ని వ్యతిరేకిస్తూ... తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. తిరుమలాయపాలెం రిజర్వ్ ఫారెస్ట్​లో ఇచ్చే ఇళ్ల స్థలాలు నివాసయోగ్యం కాదని మహిళలు ఆందోళనకు దిగారు. ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో అడవిలో స్థలాలు ఇస్తే ఎలా ఉంటామని నిలదీశారు.

పాములు, జంతువుల మధ్య తాము బతకలేమని... ఎటువంటి సౌకర్యాలు కూడా లేవని వాపోతున్నారు. అనువైన ప్రాంతంలో స్థలాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్​కు వినతిపత్రం అందించారు.

ఇదీ చదవండీ...పోలీసులే అన్నదాతలకు న్యాయం చేయాలి: సీపీఐ రామకృష్ణ

ABOUT THE AUTHOR

...view details