ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెన్షన్‌ లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి.. కరవైన ప్రజల మద్దతు - పింఛన్​ లబ్దిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖీ

CM JAGAN RAJAHMUNDRY MEETING : పింఛన్​ లబ్దిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖీ సభకు ప్రజల మద్దతు కరవైంది. పూర్తి ఏర్పాట్లు లేక సభ ప్రాంతం నుంచి ప్రజలు, పింఛన్​ లబ్దిదారులు మండిపడ్డారు. సభ ప్రాంతానికి ప్రజలను భారీ స్థాయిలో తరలించినవారు.. కనీసం తాగునీటికి, కూర్చోటానికి ఏర్పాట్లు చేయలేదని సభకు వచ్చిన పింఛన్​ లబ్దిదారులు మండిపడ్డారు.

CM JAGAN RAJAHMUNDRY
పింఛన్​ లబ్దిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖీ

By

Published : Jan 3, 2023, 8:49 PM IST

CM JAGAN RAJAMUNDRY MEETING : రాజమహేంద్రవరంలో సీఎం జగన్ సభకు మద్దతు కరవైంది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే చాలా మంది ప్రజలు మధ్యలోనే వెళ్లిపోయారు. సభా ప్రాంగణం వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేవని.. నిల్చునే ఎలా ఉండాలని మండిపడ్డారు. తాగునీరు కూడా లేకపోతే ఎలా అంటూ పెదవివిరిచారు. ముఖ్యమంత్రి సభ కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించినప్పటికీ.. ప్రజలు సభ ప్రాంగణం వద్ద లేకపోవటంతో లాభం లేకపోయింది.

రాజమహేంద్రవరంలో జగనన్న సమావేశానికి కరవైన ప్రజల మద్దతు

ABOUT THE AUTHOR

...view details