తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో 3 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడంపై ఆ ప్రాంత వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల దిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ అని తేలింది. అతని కుమారుడితోపాటు కోడలు, మనవడు, మనవరాలు కొత్తపేటలో నివసిస్తున్నారు. వీరంతా రాజమహేంద్రవరంలోని ఆ వ్యక్తి వద్దకు వెళ్లి ఒక రోజు ఉండి వచ్చారు. ఈ నేపథ్యంలో కొత్తపేటకు చెందిన ఈ నలుగురికి పరీక్షలు చేయగా.. అతని కోడలు, మనవడు, మనవరాలికి కరోనా సోకినట్టు వైద్యశాఖ నిర్ధారించింది. ఈ విషయమై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కొత్తపేటలో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్ - Corona Positive Cases in kottapeta
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల దిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో అతని కుటింబీకులకు పరీక్షలు నిర్వహించగా కరోనా బాధితుడి కోడలు, మనవడు, మనవరాలికు కరోనా సోకినట్లు వైద్యశాఖ నిర్ధరించింది.
కొత్తపేటలో కరోనా కలకలం