వర్షం వీడినా... వరద కష్టాలు మాత్రం తూర్పుగోదావరిజిల్లావాసులను వదలడం లేదు. అమలాపురం డివిజన్‌లో లోతట్టు కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. జిల్లాలోని మన్యంలో కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మారేడుమిల్లి ప్రధాన రహదారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. రంపచోడవరంలో ఐటీడీఏ క్వార్టర్స్, ఎర్రంరెడ్డినగరం వద్ద ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిత్యావసర సరకులు నిల్వ చేసే గోదాముల్లో నీరు చేరి బియ్యం బస్తాలు తడిచి ముద్దయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటితో భూపతిపాలెం జలాశయం నిండింది. రెండు గేట్లు ఎత్తి 1500 కూసెక్కుల నీటిని విడుదల చేయటంతో దిగువన ఉన్న రంప, పండిరిమామిడి కాలువలు ఉద్ధృతంగా ప్రవహించాయి.
వదలని వాన కష్టాలు... విరిగిపడిన కొండ చరియలు - తూర్పుగోదావరిలో వర్షాలు
వాన కష్టాలు తూర్పుగోదావరిజిల్లా వాసులను వదలటం లేదు. జిల్లాలోని మారేడుమిల్లి ప్రధాన రహదారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. రంపచోడవరంలో ఐటీడీఏ క్వార్టర్స్, ఎర్రంరెడ్డినగరం వద్ద ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు.
![వదలని వాన కష్టాలు... విరిగిపడిన కొండ చరియలు people suffer due to heavy rains in east godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9205873-878-9205873-1602907429138.jpg)
వదలని వాన కష్టాలు... విరిగిపడిన కొండ చరియలు